Tue Mar 11 2025 06:34:57 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా?
వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పదవికి రాజీనామా చేయనున్నారు. మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు రిజైన్ చేయనున్నారు

ఈరోజు ఇద్దరు వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పదవికి రాజీనామా చేయనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ, నెల్లూరు జిల్లాకు చెందిన బీద మాస్తాన్ రావులు నేడు రాజ్యసభ స్పీకర్ కు తమ రాజీనామా లేఖలను సమర్పించనున్నారు. నిన్న రాత్రి ఈ ఇద్దరు ఢిల్లీకి చేరుకున్నారు.
రాజీనామా లేఖను...
మోపిదేవి వెంకటరమణ గత కొద్ది కాలంగా వైసీపీ హైకమాండ్ మీద అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో ప్రయారిటీ తగ్గిందని ఆయన భావిస్తున్నారు. ఆయన నేరుగా చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇక బీద మస్తాన్ రావు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వీరిద్దరికీ టీడీపీ హైకమాండ్ నుంచి గట్టి హామీ లభించడంతో తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు.
Next Story